ఈ కొత్త సినిమా మన తెలుగు తనయుడు చేతిలో ఎలా మారిపోయిందో తెలుసుకుందాం..!




మోహన్ లాల్ తాను స్వయంగా దర్శకత్వం వహించిన మొట్ట మొదటి సినిమా 'బారోజ్' డిసెంబర్ 26 న థియేటర్లలోకి వచ్చింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. చిల్డ్రన్స్‌ ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా డెబ్యూ చేశారు.

అయితే సినిమా విడుదల అయిన తర్వాత మిక్స్డ్‌ రివ్యూలే వస్తున్నాయి. కొంతమంది ప్రేక్షకులు మోహన్‌ లాల్‌ తొలి ప్రయత్నంలోనే మంచి సినిమా తీశారని అంటుండగా.. మరికొందరేమో చిల్డ్రన్స్ ఫాంటసీ అనే పేరుతో ఇంత మూసీ కథ తీయడం దారుణమని అంటున్నారు. కానీ అతని నటన, టెక్నికల్‌ విలువలు మరో లెవల్‌లో ఉన్నాయని తెలుస్తోంది.

చిన్న పిల్లలనే టార్గెట్ చేసిన సినిమా కదా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. రెండున్నర గంటలకి పైగా సాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చిన్న పిల్లలు చూడడానికి రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ మిగితా సన్నివేశాలు అయితే వారిని మంత్రముగ్దులను చేస్తాయని చెప్పవచ్చు.

సినిమాలో బాడీ లాంగ్వేజ్‌తో మోహన్‌ లాల్‌ నటించిన విధానం చూస్తుంటే ఆయన 23 ఏళ్ల యువకుడిలా కనిపిస్తారు. సినిమాలో పిల్లలను చూపించే సీన్స్‌ చాలా తక్కువ. అయితే వచ్చిన సమయంలోనూ వాళ్లు చేసిన నటన అదిరిపోయింది.

సినిమాలో హాలీవుడ్‌ నటీనటులు చాలా మంది కనిపిస్తారు. వారి నటన, భాషకు భాషాంతరీకరణ ఎక్కడా వెలితి కనిపించకుండా అద్భుతంగా చేశారు.


సినిమాటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, నేపథ్య సంగీతం అన్ని కూడా టాప్‌క్లాస్‌లో ఉండటంతో సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. భారతదేశంలో ఇలాంటి అద్భుతమైన ఫాంటసీ సినిమాలు ఇప్పటివరకు రాలేదని, సోషల్ మీడియాలో ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తం మీద చూసుకుంటే మోహన్‌ లాల్‌కు దర్శకుడిగా బారోజ్‌ మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంది. చిల్డ్రన్స్ ఫాంటసీ అడ్వెంచర్‌ సినిమాగా విడుదలైనప్పటికీ అందులో ఏ మాత్రం పిల్లలకు కనెక్ట్ అయ్యే అంశాలు లేవు. సినిమాను చూసిన చాలా మంది ప్రేక్షకులు దీనికి చిల్డ్రన్స్ సినిమా అనే పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా ఎంజాయ్ చేసే సినిమా ఇదని కామెంట్స్ చేస్తున్నారు.