గురువులకు గురు దక్షిణ.. అదే నిజమైన గురు దక్షిణ




బడులు.. యూనిఫామ్స్.. అటెండెన్స్.. పరీక్షలు.. మార్కులు.. ఏళ్ల తరబడి ఈ క్రమం అలానే కొనసాగుతూ వస్తుంది. ఎందుకిలా చేస్తున్నాం? ఎందుకిలా జీవిస్తున్నాం? ఈ ప్రశ్నలకు ఎవరికి క్లారిటీ లేదు. ఈ సమాజంలో ఏదో ఒక లైన్‌లో ఉండాలి.. ఏదో ఒక రేస్‌లో పరుగెత్తాల్సిందే అన్న ఒక అపరిచిత కంపల్షన్ ఈ సమాజంలో మనందరిని వెన్నంటి కాల్చుకొని వస్తోంది.
మనిషిని తీర్చిదిద్దే మేస్ట్రీ.. ఆ గురు శిష్య బంధం ఈ సమాజంలో చాలా గ్రాండ్‌గా ఉంటుంది. నిజానికి అన్ని రకాల రిలేషన్‌షిప్‌లలో ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు. జ్ఞానాన్ని పంచడం.. అవసరమైనప్పుడు అవసరమైనంతగా సపోర్ట్ చేయడం.. ఇదొక గురువు బాధ్యత. అక్షరాలను అలవర్చుకోవడం నుండి మనిషిగా తీర్చిదిద్దబడే వరకు ఒక గురువు పాత్ర ఎంతటిదో అందరికీ తెలుసు.
ఇన్ని చేసే గురువుకి గురు దక్షిణ ఇవ్వడం అన్నది ఒక సంప్రదాయం. గురువు చేసిన సేవకు ప్రతీకారం అనే ఉద్దేశ్యం తో ఇచ్చే గురు దక్షిణా ఇప్పుడు కొంచెం డైల్యూట్ అయిపోయిందా అనే సందేహం వస్తోంది. టీచర్స్ డే వచ్చిందంటేనే చాలా మంది చాలా వరకు బిజీ అవుతుంటారు. ఏ గిఫ్ట్ ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? వాళ్ళ సైజు ఏంటి? అనే ప్రశ్నలతో చాలా మంది ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.
రకరకాల గిఫ్ట్స్‌ వెతుకుతూ.. రకరకాల షాపులు సర్ఫ్ చేస్తూ.. చివరకు ఒక గిఫ్ట్‌ సెలెక్ట్ చేసి కొనుక్కు వచ్చి గురువుకిస్తారు. ఇది ఒక సంప్రదాయంగా మారింది. గురువుకి ఏం కావాలో కనుక్కొని తదనుగుణంగా గిఫ్ట్ ఇస్తే.. దానికి ఎంతో విలువ ఉంటుంది కదా. అది కేవలం గిఫ్ట్‌ కాదు.. ఇందులో భావోద్వేగాలు కలసి ఉంటాయి. మన హృదయంలో ఉండే గౌరవం, కృతజ్ఞత ఈ గిఫ్ట్ ద్వారా వ్యక్తం కావాలి.
కానీ వీటన్నిటికీ మించి నిజమైన గురు దక్షిణ అంటే ఏమిటి? ఆ బోధనలను ఆచరించడం అంటేనే గురు దక్షిణ ఇచ్చినట్టే. ఒక మెడికల్ స్టూడెంట్‌కు మంచి మార్కులు వచ్చినంత మాత్రాన మంచి డాక్టర్ అవ్వరు. అలాగే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ మంచి జాబ్ వస్తే సరిపోదు. మనకి నేర్పిన విద్యను సమాజం కోసం వాడాలి. అదే గురువుకి నిజమైన గురు దక్షిణ.
ఆర్థికంగా ఎంత పెద్దగా ఉండే గిఫ్ట్ ఇచ్చినా మనకి నేర్పిన విద్యను మూలన పెట్టినట్లయితే.. అది నిజమైన గురు దక్షిణ కాదు. అలాగే మనకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చినా.. నేర్పిన విద్యను మనం ఆచరిస్తే.. అదే నిజమైన గురు దక్షిణ. ఆచరణే అసలు గురు దక్షిణ. మనం ఆచరించబోవు ఆ విద్య అంతకంటే ఎంతో విలువైనది.