అటువంటి స్టాక్స్‌లో ఎన్‌ఎండీసీ(NMDC) కూడా ఒకటి. ఈ స్టాక్‌పై నిపుణులంతా అప్రమత్తం అవుతున్నారు. ఈ స్టాక్‌లో మరింత నష్టం వచ్చే అవకాశముందని.. వెంటనే అమ్మేయాలని సూచిస్తున్నారు.
పెట్టుబడిదారులకు హెచ్చరిక:
ప్రముఖ బ్రోకరేజ్ ఫర్మ్ ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్.. ఎన్‌ఎండీసీ స్టాక్‌పై అమ్మక సిఫార్సు చేసింది. దీనిని వెంటనే విక్రయించాలని పెట్టుబడిదారులకు హెచ్చరికలు జారీ చేసింది. 68.1 రూపాయల వద్ద కొనుగోలు చేసినవారు.. ప్రస్తుత టార్గెట్ 60 రూపాయల వద్ద ఉందని తెలిపింది.
స్టాక్‌లో ఇప్పటికే 7 నుంచి 8 శాతం నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని పెంచుకోకుండా.. టార్గెట్ వచ్చిన వెంటనే అమ్మేయాలని నిపుణులు చెబుతున్నారు.
తక్షణం విక్రయించండి..
ఎన్‌ఎండీసీ స్టాక్‌ను ప్రస్తుత ధరల వద్ద అమ్మేయాలని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్మ్ కెర్ మ్యాక్రీ రిసెర్చ్ కూడా సిఫార్సు చేసింది. దీని టార్గెట్ 62 రూపాయల వద్ద ఉందని తెలిపింది. అయితే.. ఇది కూడా అనేకసార్లు పాత రికార్డులను బ్రేక్ చేస్తూ, కొత్త కొత్త ఎత్తులకు దూసుకెళ్లింది. కాబట్టి, తక్షణమే ఈ స్టాక్‌ను వదిలించుకోవడమే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు.