ఐపీఓ మార్కెట్లో మరో కంపెనీ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ప్రారంభం కానున్న క్వాడ్రంట్ ఫ్యూచర్‌టెక్ లిమిటెడ్ (QFT) ఐపీఓకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ సంస్థ ఐపీఓకు రూ.275 నుంచి రూ.290 ప్రైస్‌బ్యాండ్‌ను ఫిక్స్ చేసింది. కానీ గ్రే మార్కెట్‌లో ఈ షేర్లు ఏకంగా రూ.62 శాతం ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.
అంటే ఐపీఓలో ఏ షేరు రూ.290కి దక్కాల్సి వస్తే.. గ్రే మార్కెట్‌లో దాని విలువ రూ.470 వరకు ఉంది. అంటే దాదాపు రూ.180 లాభం. కొన్ని అన్లిస్ట్ల అంచనాల ప్రకారం.. ఈ గాప్ ఇంకా పెరిగి రూ.230వరకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఈ స్టాక్ ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ఐపీఓ మార్కెట్లో రచ్చ రచ్చ.. రూ.300 కోట్ల సైజ్‌తో QFT.. అప్లై చేయాలా? వద్దా?
క్వాడ్రంట్ ఫ్యూచర్‌టెక్ ప్రధానంగా.. ప్లాస్టిక్ మోల్డింగ్, అసెంబ్లీ కంపెనీ. దేశీయంగా వీళ్లు ఓఎల్ఈడీ టీవీ, మానిటర్‌లు, ఆటోమొబైల్స్‌కు కావాల్సిన విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంటారు. ఇక విదేశాల్లోనూ ఓఎల్ఈడీ టివీ, మానిటర్ల, ఆటోమొబైల్ కంపెనీలకు విడిభాగాలను సప్లై చేస్తున్నారు.
అయితే QFT ప్రస్తుతం నష్టాల్లోనే ఉంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నష్టాలను నమోదు చేసింది. అయినప్పటికీ.. భవిష్యత్ వృద్ధి అవకాశాలను పరిగణలోకి తీసుకుని ఇన్వెస్టర్లు ఈ ఐపీఓపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పుకోవాలి.
క్వాడ్రంట్ ఫ్యూచర్‌టెక్ ఐపీఓ జనవరి 7 నుంచి 9 వరకు ఓపెన్ కానుంది. ఈ సమయంలో షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన జూన్ 14న అల్యూట్ చేయనున్నారు. ఇక జనవరి 14న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానుంది.
డిస్క్లైమర్: పై వార్త కేవలం సమాచారమిచ్చేందుకు మాత్రమే ఉద్దేశించబడింది. ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ్గా పరిగణించరాదు. ఇన్వెస్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం మంచింది.