మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. మలయాళ టీవీ సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన మలయాళ సీనియర్ నటుడు దిలీప్ శంకర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. అరోమా హోటల్ రూమ్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆయన మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీవీ సీరియల్స్‌తో మంచి పేరు సంపాదించుకున్నారు దిలీప్. 'అమ్మయిరియాతే', 'పంచాగ్ని', 'సుందరి' వంటి సీరియల్స్ ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆయన నటించిన చాప్పా కురుషు, నార్త్ 24 కాతం వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చాప్పా కురుషు సినిమాకు ఆయనకు ఉత్తమ నటుడిగా రాష్ట్ర అవార్డు కూడా వచ్చింది.
ఆయన హత్యకు గురయ్యారా.. లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్యే అని పోలీసులు భావిస్తున్నారు. అయితే మృతదేహం నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలిస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతే మరణానికి గల కారణం తెలుస్తుంది.