ఫ్రెంచ్ ప్రధానమంత్రి మిషెల్ బార్నియర్‌పై అవిశ్వాస తీర్మానం దాఖలైంది. సభ్యుల ఓట్లతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. బడ్జెట్ బిల్లుపై ఓటింగ్ జరిగి పతనమైంది. ఇది ఫ్రాన్స్‌లో అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంగా నిలిచింది.
సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న బార్నియర్‌పై 331 మంది సభ్యులు ఓటు వేయడంతో ఈ ప్రభుత్వం పతనమైంది. 577 మంది సభ్యులు ఉన్న ఫ్రాన్స్ పార్లమెంట్‌లో బార్నియర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ఇదే మొదటిసారి.
ఫ్రెంచ్ ప్రభుత్వం పడిపోవడం దేశంలో భారీ రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఈ పరిణామం యూరోపియన్ యూనియన్ అంతటా ఆందోళనలను కలిగించింది. బార్నియర్ ప్రభుత్వం పతనం కావడం ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మ్యాక్రాన్‌కు తీవ్రంగా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.