ముంబై బోట్ యాక్సిడెంట్




ముంబై బోట్ యాక్సిడెంట్‌లో 13 మంది మృతి
ముంబై, డిసెంబర్ 18: ముంబై తీరంలో సోమవారం భారత నావికాదళ స్పీడ్‌బోట్ ప్రయాణికుల ఫెర్రీని ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో అందులో ఉన్న 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 99 మంది ప్రయాణీకులను రక్షించారు. మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యాక్సిడెంట్ బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా, ప్రమాదంలో గాయపడినవారికి రూ.50,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
నౌకాదళ స్పీడ్‌బోట్ ఇంజిన్ ట్రయల్స్‌ను నిర్వహిస్తుండగా అదుపు తప్పి గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలో ప్రయాణికుల ఫెర్రీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పీడ్‌బోట్‌లోని ముగ్గురు నావికాదళ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదంపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నావికాదళం కూడా సొంత విచారణ చేపట్టింది.