వీల్‌చెయర్ టెన్నిస్ పారాలింపిక్స్
కోరుకుంటే ఏదైనా సాధించవచ్చు. శరీరంలో ఏదో లోపం ఉన్నా, కొన్ని అవయవాలు పనిచేయకపోయినా మనసుంటే మార్గం ఏర్పడుతుంది. శారీరక అవలక్షణులు క్రీడలకు అడ్డుకావు. వారి స్థితికి తగ్గట్టుగా మార్పులు చేసుకుని, వారు కూడా విజయపథంలో ప్రయాణించవచ్చు.
వీల్‌చెయర్ టెన్నిస్ ఆట అందుకు చక్కని ఉదాహరణ. క్రిమి సంహారక ఔషధ వాడకం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతిని, డయాలసిస్ అవసరమై ఒకప్పుడు మంచానికే పరిమితమయ్యారు క్రిస్‌టోఫర్ సబెల్ (చైర్‌మేన్, ఇంటర్నేషనల్ వీల్‌చెయర్ టెన్నిస్). కానీ వీల్‌చెయర్ టెన్నిస్ బాధ్యత తీసుకోవడంతో ఆయన జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఆయన పారాలింపిక్ క్రీడాకారుడు అయ్యారు. వీల్‌చెయర్ టెన్నిస్ వల్ల ఆయన ఆత్మవిశ్వాసం పెరిగింది, అంగవైకల్యంపై పోరాటం సాగించడం నేర్చుకున్నారు.
వీల్‌చెయర్ టెన్నిస్ అనేది పారాలింపిక్ క్రీడాల్లో భాగం. ఈ క్రీడను వీల్‌చెయర్‌లో కూర్చోని మామూలు టెన్నిస్ మ్యాచ్‌లా సాధారణ టెన్నిస్ కోర్ట్‌లో ఆడుతారు. 1988 సీల్ పారాలింపిక్స్‌లో ఈ క్రీడ అరంగేట్రం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది అంగవైకల్య క్రీడాకారులు ఇందులో పాల్గొంటారు.
వీల్‌చెయర్ టెన్నిస్ ఆటలో అంతర్జాతీయంగా పోటీపడే ముగ్గురు తెలుగు క్రీడాకారులు డాక్టర్ దివ్య, నోయెల్ కపూర్, సుధానిర్మల. వీల్‌చెయర్ టెన్నిస్ వల్ల వారి జీవితాలే మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక పోటీలలో పాల్గొన్నారు. పతకాలు సాధించారు. వారి కథలు ఎందరో అంగవైకల్యులకు స్ఫూర్తినిస్తున్నాయి.