సైక్లోన్ దానా




బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఈ నెల 23న బలపడి తుపానుగా మారనుంది.

సౌదీ అరేబియా దీనికి 'దానా' అనే పేరు పెట్టింది. అరబిక్ భాషలో 'దానా' అంటే 'దాతృత్వం' అని అర్థం.

ఈ తుపాను గురువారం నాడు ఒడిశా, బెంగాల్ తీరాలను తాకనుంది. ఒడిశా అధికారులు అప్రమత్తమయ్యారు.

ఈ తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్‌పై కూడా ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తుపాను పురీ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరప్రాంత జిల్లాలైన ఖుర్దా, పూరీ, జగత్‌సింగ్‌పూర్, కటక్, నయాగఢ్, కేంద్రపరా, భద్రక్, బాలసోర్‌లకు తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్ తీరంలోని దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హుగ్లీ జిల్లాలకు కూడా ఈ తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉంది.