Atul Subhash




బెంగళూరులో ఫ్లాట్‌లో వేలాడుతూ కనిబించాడు. అతని ఫ్లాట్లోని గోడపై “ న్యాయం జరగాలి” అనే ప్లకార్డ్ ఉంది. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతున్నది. బీహార్‌కు చెందిన ఆతుల్‌ సుభాష్‌ (34) బెంగళూరు మంజునాథ్‌ లేఔట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. ఈయన ముగ్గురు ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గంటల ముందు ఆతుల్‌సుబాష్‌ తన మిత్రుడికి 24 పేజీల లేఖ రాశాడు. అందులో తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు, మానసిక వేదన కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. భార్య తనను కేసులు పెట్టి వేధించారని ఆరోపించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిని శిక్షించాలని కోరాడు. భర్త మరణించారని సమాచారం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అతని మరణానికి గల కారణాలు అసలు వాస్తవాలు పోలీసులు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.