Ayodhya Diwali 2024




రాముడి నగరంలోని ప్రకాశవంతమైన దీపావళి : అయోధ్య 2024
అయోధ్యలోని పండుగలలో కార్తీక మాసంలో వచ్చే దీపావళి అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగలో రోజుల తరబడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ అన్నిటిలోకి ప్రధానమైనది ధనుర్మాసంలో చేసే దీపోత్సవం.
ఈ పండుగ ప్రారంభం నుంచి ముగింపు వరకు రామ నగరమంతా దీపాలతో వెలిగిపోతుంది. గత కొన్ని సంవత్సరాలుగా యోగి ప్రభుత్వం అధ్వర్యంలో అయోధ్య దీపోత్సవం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేసే ఈ దీపోత్సవం కోసం దేశ విదేశాల నుంచి పర్యాటకులు అయోధ్యకు వస్తారు. దేశంలోని సుమారు 5 లక్షల మందితో పాటు 60కి పైగా దేశాలకు చెందిన సుమారు 10 వేల మంది దీపోత్సవంలో పాలుపంచుకుంటారు.
అయోధ్య దీపోత్సవం ప్రపంచ ప్రఖ్యాతి గాంచడానికి కొన్ని అంశాలు ఎంతో దోహదం చేశాయి. ముఖ్యంగా గిన్నిస్ రికార్డు సృష్టించడం. ఇందుకోసం ప్రతి ఏటా వివిధ రకాల డిజైన్లు ఎంపిక చేస్తారు. 2023 దీపోత్సవంలో 15 లక్షల దీపాలను వెలిగించడం ద్వారా అయోధ్య రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించింది. అయోధ్య ప్రపంచ నక్షకి మీద వెలిగించిన అత్యధిక దీపాల రికార్డును సృష్టించింది. అదే సమయంలో అయోధ్య మరొక రికార్డు కూడా సృష్టించింది. అత్యధిక వ్యక్తులు దీపాల వెలిగింపులో పాల్గొన్న రికార్డు అది.
అయోధ్యలో జరిగే దీపోత్సవం ఈ ఏడాది అక్టోబర్ 26 శుక్రవారం నాడు జరుగనుంది. దీపావళి సందర్భంగా రామ నగరమంతా పండుగ వాతావరణం నెలకొంది. అయోధ్యను పండుగ శోభతో అలంకరించారు.