భారతదేశం అంతటా చిన్నా పెద్దా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. వెలుగుల పండుగ అని దీనిని పిలుస్తారు. ఈ పండుగను లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి, గణేశుడు మరియు కుబేరుడు లను పూజిస్తారు. దీపావళి పండుగను ఐదు రోజులపాటు జరుపుకుంటారు. మొదటి రోజును ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున సరస్వతీ దేవిని మరియు లక్ష్మీ దేవిని పూజిస్తారు. రెండవ రోజును నరక చతుర్దశి అంటారు. ఈ రోజున నరకాసురుడిని చంపినందుకు కృష్ణుడిని పూజిస్తారు. మూడవ రోజును దీపావళి అని అంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు. నాల్గవ రోజును గోవర్ధన పూజ అని కూడా అంటారు. ఈ రోజున గోవర్ధనుడిని పూజిస్తారు. అయిదవ రోజును భాయ్ దూజ్ అని కూడా పిలుస్తారు. ఈ రోజున అన్నా చెల్లెళ్లకు మమకారాన్ని చూపడానికి పండుగ చేసుకుంటారు.