ఫహద్ అహ్మద్ గురించి పెద్దగా విన్నవాళ్ళు ఉండరు. కానీ ఈయన గురించి తెలిస్తే, ఇండియాలోని రాజకీయ ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉంటారేమో. ఫహద్ అహ్మద్ ముంబైలోని అనుశక్తి నగర్ నియోజకవర్గానికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్ చంద్ర పవార్ సభ్యుడు. ఈయన ముంబై యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్. ఎన్.సి.పి యూత్ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సోషల్ వర్కర్ నెహ్రూ యువ కేంద్రలో రాష్ట్ర కోఆర్డినేటర్ గా పని చేసారు. అంతర్జాతీయ యూత్ సమ్మిట్లో భారతదేశం తరపున మాట్లాడారు. ఐరాసలో నెహ్రూ యువ కేంద్ర తరపున మాట్లాడారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనర్ గా వర్క్ చేసారు.
ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫహద్ అహ్మద్ బిజెపి మాజీ ఎంపి కిరీట్ సోమయ్యను 3,000 ఓట్లకు పైగా తేడాతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తానెప్పుడూ రాజకీయాలలోకి రావాలని అనుకోలేదని ఫహద్ అన్నారు. కానీ ప్రజల బలహీనతలు, వారి సమస్యలు తెలుసుకొని రాజకీయాలలోకి వచ్చానని చెప్పారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని కొత్త ఎమ్మెల్యే ఫహద్ అహ్మద్ అన్నారు.