India New Zealand Test: భారత్ కు ఎదురుదెబ్బ




భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టుకి ఎదురుదెబ్బ తగిలింది. తొలి రోజు ఉదయం 9.30కి వర్షం కారణంగా మొదలుకావాల్సిన మ్యాచ్ మొత్తం రోజు వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో రెండోరోజు జట్లు బరిలోకి దిగాయి. మ్యాచ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన భారతజట్టు చరిత్రలో ఎన్నడూ లేని విதంగా 46 పరుగులకే ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. మ్యాట్ హెన్రీ 5 వికెట్లు, బోల్ట్ రెండు వికెట్లు పడగొడ్డారు. కేవలం 31.2 ఓవర్లలోనే భారత్ ఆలౌట్ కావడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా భారత్‌లో జరిగే టెస్ట్‌లో అతి తక్కువ స్కోరు కావడం విశేషం.
ఇక రెండో రోజు లంచ్ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు తడబడింది. భారత బౌలర్ల షమీ, సిరాజ్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. దీంతో న్యూజిలాండ్ జట్టు రెండో రోజు అంతానికి 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. న్యూజిలాండ్ జట్టు ఆటగాడు విల్ యంగ్‌ 20 పరుగులు, టామ్‌ లాథమ్ 19 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నారు. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం భారత జట్టు కంటే 13 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడో రోజు భారత జట్టు బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేసి న్యూజిలాండ్ జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేస్తారని, ఆ తర్వాత భారత బ్యాట్స్‌మన్లు బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు సాధిస్తుందని భావిస్తున్నారు.