కాండ్లా విజృంభించినా... సూర్యకుమార్ యాదవ్ దెబ్బకొట్టినా... టీమిండియా మొదటి టెస్టులో మోకరిల్లింది. బంతితో న్యూజిలాండ్ స్పిన్నర్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్ అదరగొట్టారు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 348 పరుగుల వద్ద ఆలౌటైంది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ అయ్యర్(76), గిల్(49), జడేజా(42) రాణించారు.
అనంతరం న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల దాటికి 402 పరుగుల వద్ద ఆలౌటైంది. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ అయ్యర్ త్వరగానే పెవిలియన్ చేరారు. క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగినా అతన్ని మినహా మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. చివరికి టీమిండియా 462 పరుగులు చేసి ఆలౌటైంది.
న్యూజిలాండ్‌కు 107 పరుగుల టార్గెట్భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత 4వ రోజు ఆట ముగిసింది. దీంతో, న్యూజిలాండ్‌కు 5వ రోజు ఆటలో విజయానికి 107 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, కేన్ విలియమ్సన్ సేన తమ టార్గెట్ చేరుకుంటుందా? లేక భారత జట్టు విజయం సాధిస్తుందా? అనేది రేపటి 5వ రోజు ఆటలో తేలనుంది.