NPS Vatsalya Yojana



సెప్టెంబర్‌ 18న (నేడు) మైనర్ల కోసం జాతీయ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS) కింద ‘వత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభిస్తున్నారు. పిల్లల భవిష్యత్తుకు పొదుపు చేసేందుకు వత్సల్య పథకం తోడ్పడుతుంది.

పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డివెలప్‌మెంట్‌ అథారిటీ ఆధ్వర్యంలో పెట్టుబడి, నిర్వహణ జరుగుతుంది. పథకంలో చేరడం ద్వారా రూ.1000 నుంచి ఏ మొత్తాన్నైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 సీ కింద పన్ను మినహాయింపులు పొందవచ్చు. కనీస పెట్టుబడి కాలపరిమితి మినహాయించి, 18 ఏళ్లు నిండే వరకు పథకం కొనసాగుతుంది.

ఎవరు అర్హులు?

  • భారత పౌరులు
  • ఎన్‌ఆర్‌ఐలు
  • తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల పేరిట ఖాతా తెరవచ్చు

పెట్టుబడి ఎలా?:

  • కనీసం రూ.1000 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు
  • ఆటో డెబిట్‌ ద్వారా కూడా వాయిదాలను చెల్లించే వీలుంది
  • 60 ఏళ్లు నిండాక డబ్బుని విత్‌డ్రా చేసుకోవచ్చు

పన్ను మినహాయింపులు:

  • ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 సీ కింద, ఖాతాదారుడు పెట్టుబడిపై పన్ను మినహాయింపులు పొందవచ్చు
  • ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంటుంది

ప్రయోజనాలు:

  • పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80 సీ కింద పన్ను మినహాయింపు
  • పిల్లల భవిష్యత్తుకు పొదుపు చేసుకునేందుకు సురక్షితమైన మార్గం
  • దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

  • పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డివెలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
  • బ్యాంకు శాఖలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు

పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడానికి NPS వత్సల్య పథకం ఒక ఆకర్షణీయమైన మరియు లాభదాయకమైన ఎంపిక. పథకం అందించే పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలు మరియు అధిక రాబడిని పొందే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడికి ఇది ఉత్తమమైన ఎంపికలలో ఒకటి.