రెజ్లింగ్ రంగంలో తన మార్క్ వేసిన వినేష్ ఫోగట్ రాజకీయ రంగంలోకి ఎంటర్ అయ్యారు. తాజాగా జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి జులానా నియోజకవర్గం నుంచి విజయఢంకా మోగించారు. తొలిసారిగా పోటీ చేసినా.. మొండిఘటమేమిటో నిరూపించారు.
1994, ఆగస్ట్ 25న జన్మించిన వినేష్ ఫోగట్.. చిన్నతనం నుంచే రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌తో పాటు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించారు. ఒలింపిక్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించారు. 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
క్రీడా రంగంలో ఎన్నో విజయాలు అందుకున్న వినేష్.. ఇప్పుడు రాజకీయ రంగంలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున జులానా నియోజవర్గం నుంచి బరిలో దిగి.. బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. 6015 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
వినేష్ విజయంలో సొంత కుటుంబంతో పాటు.. ఆమెను అభిమానించే ఎంతో మంది మద్దతుదారుల పాత్ర కూడా ఉంది. తాను రెజ్లింగ్ రంగంలో సాధించిన ప్రతి విజయం తర్వాత గ్రామాన్ని సందర్శించడం.. ప్రజలతో మమేకమవ్వడం.. వారి సమస్యలను పరిష్కరించడం వినేష్ చేసిన సేవ. అదే ఆమెకు ఇప్పుడు మంచి ఫలితాలను అందించింది.
రాజకీయ రంగంలోకి తొలిసారిగా అడుగుపెట్టే వినేష్‌పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటారా.. నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారనేది వేచి చూడాలి. అయితే, రాజకీయ రంగంలో కూడా రెజ్లింగ్‌లో సాధించిన విజయాలను అందుకుంటారని ఆమె అభిమానులు విశ్వసిస్తున్నారు.